T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–-8లో భాగంగా ఈరోజు పల్లెకెలె వేదికగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే పాకిస్థాన్ సెమీఫైనల్ కు చేరుకునే ఛాన్స్ ఉంది. లేదంటే న్యూజిలాండ్ సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ సెమీస్ కి చేరుకోదని టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పుకొచ్చాడు. లంకతో మ్యాచ్‌లో పాక్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేస్తే 64 రన్స్ తేడాతో, అదే టార్గెట్ ఛేదించాల్సి వస్తే.. 13.2 ఓవర్లలోనే ఉంటుంది అన్నారు. అప్పుడే కివీస్ కంటే మెరుగైన నెట్ రన్ రేటును ఆ జట్టు సొంతం చేసుకుని సెమీస్‌లోకి వెళ్తుందని.. కానీ పాక్ ఇలా గెలవడం కష్టమని వెల్లడించాడు.
ఇంగ్లాండ్ మ్యాచ్ లో దాయాది దేశానికి అదృష్టం కలిసొచ్చింది కానీ ప్రతీసారి అలా జరగదు అని వీరేంద్ర సెహ్వాగ్ తేల్చి చెప్పారు. 160 రన్స్ చేసి 60 పరుగుల తేడాతో గెలవాలంటే, శ్రీలంక 90కి ఆలౌట్ కావాలి.. అది అసాధ్యం అన్నాడు. 13.2 ఓవర్లలో చేజ్ చేయడం కూడా ప్రాక్టీకల్ గా సాధ్యమే పని కాదు.. ప్రస్తుతం పాకిస్థాన్ బ్యాటింగ్ అలాంటి దూకుడు ప్రదర్శించే అవకాశమే లేదన్నాడు. వాస్తవ పరిస్థితులను కూడా మనం గమనించాలని తెలిపాడు. పాక్ జట్టు ఇప్పటి వరకు 160 పరుగుల స్కోరు సైతం ఈజీగా ఛేజ్ చేయలేకపోయిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద స్కోర్ ని పాకిస్తాన్ చేజ్ చేయడం అసాధ్యమంటూ ఇజ్జత్ తీసేశాడు. ఈ మ్యాచ్ లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పాక్ పై.. నెట్ రన్ రేట్ లెక్కలను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచు దాయాది దేశం శ్రీలంకపై గెలవండి అని సెహ్వాగ్ సూచించాడు.
Virender Sehwag cooked Pakistan on live camera “Inse kuch nahi hone wala” ??pic.twitter.com/Iry5j9wrqR
— ?????¹⁸ (@varunx18) February 28, 2026

