జుట్టును ఎలా కాపాడుకుంటున్నారు?

జుట్టును ఎలా కాపాడుకుంటున్నారు?

జుట్టు గురించి చెప్పాలంటే.. రాలకముందు ‘రాలుతుందేమో’ అని, రాలుతుంటే ‘రాలుతున్నది’ అని, రాలిన తర్వాత ‘రాలిపోయిందే’ అనుకోవడం అనే మూడు స్టేజీలు ఉంటాయి. ఏ స్టేజీలో ఉన్నా బాధపడటం మాత్రం కామన్‌‌.రకరకాల హెయిర్‌‌ ప్రాబ్లమ్స్‌‌ గురించి రోజూ వింటుంటాం. వీటిల్లో చాలా సమస్యలకు మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణం అవుతుంటాయి. ఆ తప్పులేంటి? హెల్దీ హెయిర్‌‌ కోసం ఏం చెయ్యాలి?

ఇవి చెయ్యండి!

  •    మీ హెయిర్‌‌ ఆయిలీగా ఉంటే ఎక్కువసార్లు తలస్నానం చేస్తే మంచిది.
  •    షాపూని మాడుకు బాగా రుద్దుకోవాలి.
  •    షాంపూ చేశాక జుట్టుకు కండీషనర్‌‌ రాసుకోవడం మర్చిపోవద్దు.
  •     జుట్టు మొదళ్లలో కాకుండా అంచుల్లో కండీషనర్‌‌ రాస్తే ఫలితం ఉంటుంది.
  •    మీ హెయిర్‌‌ ఎలాంటి రకమో తెలుసుకొని దానికి సరిపడే షాంపూ, కండీషనర్లనే వాడాలి.
  •    స్విమ్మింగ్‌‌ చేస్తున్నప్పుడు జుట్టుకి క్యాప్‌‌ పెట్టుకోవాలి.

ఇవి చెయ్యకండి!

  • కండీషనర్‌‌ని వాడకపోవడం.
  • స్నానం చేసిన తర్వాత జుట్టుని టవల్‌‌తో గట్టిగా రుద్దడం.
  • జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో దువ్వుకోవడం.
  • జుట్టుని మనకు కావాల్సిన స్టైల్లో ఉంచే స్టైలింగ్‌‌ ప్రొడక్ట్స్‌‌ని వాడటం.
  • పోనీ టెయిల్‌‌, బన్‌‌ లాంటి హెయిర్‌‌స్టైల్స్‌‌ కోసం జుట్టుని గట్టిగా వెనక్కి లాగడం.
  • విగ్గు, సవరం లాంటివి వాడటం.
  •  జుట్టుకి రంగులు వెయ్యడం.
  • మాటిమాటికీ జుట్టు దువ్వుకోవడం.
  • జుట్టు పల్చబడటం, రాలిపోవడం.. ఇలా జుట్టుకి సంబంధించిన సమస్య ఏదైనా వస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌‌ని సంప్రదిస్తే మంచిది. ఎందుకంటే సమస్య పెద్దది కాకముందే దానికి పరిష్కారాన్ని ఆలోచించొచ్చు.

డాక్టర్ వ్రితికా గడ్డం,
ఎం.డి. డెర్మటాలజీ,
నావా స్కిన్ అండ్ బాడీ కేర్,
హైటెక్స్, హైదరాబాద్.
ఆన్ లైన్ కన్సల్టేషన్ కోసం 7799726282.

 

ఏడ్వడం కూడా మంచిదేనంట..