హైదరాబాదీ ‘సంశోధన్’కు అరుదైన అవార్డు

హైదరాబాదీ ‘సంశోధన్’కు అరుదైన అవార్డు

ఈ వేస్ట్ రీసైక్లింగ్ కోసం సర్క్యూలర్ మోడల్ క్రియేట్ చేసిన సంస్థ హైదరాబాద్ కు చెందిన ఈ వేస్ట్, రీ–సైక్లిం గ్ లో కీలకపాత్ర పోషిస్తున్న స్టార్టప్ ‘సంశోధన్’ను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(WEF) డెల్ పీపుల్స్ చాయిస్ అవార్డు వరించింది. ఈ అవార్డును WEF ప్రతి సంవత్సరం సర్క్యూలర్ ఎకానమీలో అత్యుత్తమ మార్గాలను కనుగొన్న సంస్థలకు అందిస్తుంది. ఇళ్లు, కార్పొరేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ కంపెనీల నుంచి  సంశోధన్ ఈ వేస్ట్ ను కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత వాటిని రీ–సైక్లింగ్ చేసే సంస్థలకు చేరవేస్తుంది. ఈ–వేస్ట్ మేనేజ్ మెంట్ లో ఈ తరహా సర్క్యూలర్ మోడల్ ను క్రియేట్ చేసినందుకు సంశోధన్ ను WEF  ప్రశంసించింది.

స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు మొదలుపెట్టిన ‘టీ హబ్’ సాయంతోనే ఎకానమిస్ట్ ఎస్.దేవి, సోషల్ డెవలప్ మెంట్ ఎక్స్ పర్ట్ వి.షాలిని, ఇంజనీర్ సందీప్, పర్యావరణ వేత్త డా.షాలిని శర్మలు సంశోధన్ ను స్థాపిం చారు. ఈ వేస్ట్ ఎక్స్‌‌‌‌చేంజ్ పేరుతో వెబ్ సైట్ ను తెరిచారు. ఇందులోకి వచ్చి ఎవరైనా ఈ వేస్ట్ ఉందని, వచ్చి తీసుకెళ్లాలని రిక్వెస్ట్ పెడితే క్షణాల్లో సంశోధన్ టీమ్ వాళ్ల దగ్గరికి వెళ్లి వేస్ట్ ను కలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత సర్కారు గుర్తించిన రీ–సైక్లర్స్ వద్దకు వాటిని చేరుస్తుంది.

తెరిచి 10 నెలలే..

‘‘సంశోధన్ ను ప్రారంభించి పది నెలలు కావొస్తోం ది. ఇంత చిన్న వయసులోనే  WEF లాం టి సంస్థ నుంచి అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాం టి మోడల్స్ ను చూసేం దుకు WEF సభ్యులు ఆసక్తి కనబర్చారు. WEF ఏటా ప్రచురించే పుస్తకంలో మేం వాడిన మోడల్ గురించి వస్తుంది. పెద్ద సంస్థలు, ఎంఎన్ సీలు సైతం మా మోడల్ ను అనుసరిస్తే మంచి ఫలితాలుంటాయి’’ అని షాలిని తెలిపారు.