దేశంలోని 75 నగరాలకు చెస్‌‌ ఒలింపియాడ్‌‌ రిలే టార్చ్‌‌ 

దేశంలోని 75 నగరాలకు చెస్‌‌ ఒలింపియాడ్‌‌ రిలే టార్చ్‌‌ 
  • బ్యాటన్​ అందుకున్న ఎరిగైసి అర్జున్‌, ద్రోణవల్లి హారిక

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రతిష్టాత్మక  చెస్‌‌ ఒలింపియాడ్‌‌ రిలే టార్చ్‌‌ శనివారం హైదరాబాద్‌‌ నగరానికి చేరింది. చత్తీస్‌‌గఢ్‌‌లోని రాయ్‌‌పూర్‌‌ నుంచి వచ్చిన టార్చ్‌‌ను శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులో తెలంగాణ యువ గ్రాండ్‌‌మాస్టర్‌‌ ఎరిగైసి అర్జున్‌‌ స్వీకరించాడు. అనంతరం తెలంగాణ చెస్‌‌ ప్రతినిధులతో కలిసి గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియానికి తీసుకొచ్చి  రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌కు బ్యాటన్​ అందజేశాడు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత టార్చ్‌‌ను గ్రాండ్‌‌ మాస్టర్ ద్రోణవల్లి హారికకు శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ అందజేశారు. 

ఆదివారం తెల్లవారుజామున టార్చ్‌‌ రిలే అమరావతికి బయలు దేరుతుంది. ఇండియా తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న చెస్‌‌ ఒలింపియాడ్‌‌ ఈ నెల 28వ తేదీన  చెన్నైలో మొదలువుతుంది. కాగా, ఈ మెగా ఈవెంట్‌‌ కోసం తొలిసారి ప్రవేశ పెట్టిన  టార్చ్‌‌ రిలేను దేశంలోని 75 నగరాలకు తీసుకెళ్తున్నారు.