ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోకి అపాచీ హెలికాప్టర్లు

ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోకి అపాచీ హెలికాప్టర్లు

భారత వాయుసేన  మరింత  శక్తిని  సంతరించుకుంది. అత్యాధునిక  అపాచీ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్  అమ్ముల  పొదిలోకి చేరాయి. అమెరికాలో తయారైన  ఎనిమిది  AH 64E  హెలికాప్టర్లు.. ఇవాళ  ఎయిర్ ఫోర్స్ లోకి ఎంటరయ్యాయి. మంగళవారం పంజాబ్ లోని  పఠాన్ కోట్  ఎయిర్ ఫోర్స్  స్టేషన్ లో  ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో .. అపాచీ  హెలికాప్టర్లను  భారత వాయుసేనకు అందించారు.

ఎయిర్ ఫోర్స్  చీఫ్  దనోవా , వెస్ట్రన్  ఎయిర్ కమాండర్… ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్  ఈ  కార్యక్రమానికి  హాజరయ్యారు. ఈ సందర్భంగా  అపాచీ  హెలికాప్టర్లకు  వాటర్ కెనాల్స్ తో  సెల్యూట్  చేసింది IAF. అపాచీ హెలికాప్టర్లకు పూజలు చేశారు ఉన్నతాధికారులు. బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్  సలిల్ గుప్తా..  అపాచీ  హెలికాప్టర్లకు  సంబంధించిన  సెరిమోనియల్ కీని ….బీఎస్  ధనోవాకు అప్పగించారు. తర్వాత యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి.

యూఎస్ నేవీ చీఫ్ కెప్టెన్ డేనియల్ ఫిలియన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం మరింత బలపడిందని ఆయన చెప్పారు. అపాచీతో భారత్ ఎయిర్ ఫోర్స్ పవర్ ఫుల్ అవుతుందని ఫిలియన్ ఆకాక్షించారు.