ESI స్కామ్ : రిప్రజెంటేటివ్ ఇంట్లో 36 కోట్ల…

ESI స్కామ్ : రిప్రజెంటేటివ్ ఇంట్లో 36 కోట్ల…

దాచిన ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి
ఏసీబీ సోదాల్లో బయటపడ్డ పేపర్లు
ఓమ్ని మెడి ఫార్మా ఉద్యోగుల ఇళ్లల్లోనూ తనిఖీలు

హైదరా బాద్, వెలుగు: నకిలీ ఇండెంట్లు, బిల్లులతో ఈఎస్ఐ ఐఎంఎస్ లో జరిగిన భారీ స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాఫ్ తును వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు.. మంగళ, బుధవారాల్లో ఓమ్ని మెడి ఫార్మా ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. సనత్ నగర్ ఆకృతి అవెన్యూలోని నాగరాజు ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఒరిజినల్ ఇండెంట్లు వెలుగు చూశాయి. సుమారు రూ.36 కోట్లకు చెందిన ఒరిజినల్ ఇండెంట్లు , ఆర్డర్ కాపీలు దొరికాయి. గతేడాది మే 17న ఆర్సీ నంబర్ 827/జెడీ ఐఎంఎస్/హైదరాబాద్ పేరుతో ఉన్న ఇండెంట్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో ఓమ్నీ మెడి, క్యాండిల హెల్త్ కేర్ లిమిటెడ్, ఆంగ్లో ఫ్రెంచ్ డ్రగ్స్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో మొత్తం రూ.36,42,78,590 కోట్లకు చెంది న 286
ఇండెంట్స్, కొనుగోలు ఆర్డర్స్ ను నాగరాజు ఇంటి నుంచి ఏసీబీ సేకరించింది. రూ.కోట్లు విలువచేసే మందులను మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ కలకుంట్ల పద్మ ప్లాన్ ప్రకారమే నాగరాజు ఇంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు భద్రపరిచిందని ఏసీబీ అనుమానిస్తోంది. దీంతోపాటు ఓమ్నీ మెడి ఫార్మా ఏజెన్సీలు, ఉద్యోగుల ఇళ్ళలో కూడా ఏసీబీ తనిఖీలు చేసింది. ఈ స్కామ్ లో ప్రధాన నిందితురాలు దేవికారాణి ఆఫీస్ లో ఉండాల్సిన ఇండెంట్స్ ప్రైవేట్ వ్యక్తి నాగరాజు ఇంట్లో ఉండడంపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.