భారత్ లో భారీగా పెరిగిన కరోెనా కేసులు

భారత్ లో భారీగా పెరిగిన కరోెనా కేసులు

భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన కేసులు.. ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,94,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 442 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. మరో 60,405 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,55,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 11.05%గా ఉంది. ఒక భారత్ లో ఒమిక్రాన్ కేసులు 4868కు చేరాయి. పెరుగుతున్న కేసులు నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కొన్ని చోట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ప్రైవేటు కార్యాలయాలు బంద్ చేశాయి, బార్లు రెస్టారెంట్లు కూడా క్లోజ్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం అత్యవసర సేవల విభాగాల్లో పనిచేస్తున్నవారు మినహా.. మిగిలిన వారంతా ఇంటి నుంచే పనిచేయాలని పేర్కొంది. 

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కేసులు పెరుగుతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం చర్చించనున్నారు. ఆదివారం హై లెవెల్ మీటింగ్ నిర్వహించిన ప్రధాని.. జిల్లా స్థాయిల్లో హెల్త్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మిషన్‌‌ మోడ్‌‌లో వ్యాక్సినేషన్‌‌ను కొనసాగించాలని కోరారు.