
స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది.
అంతకుముందు, కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనను ఏడెనిమిది సార్లు చెంపదెబ్బ కొట్టాడని క్రూరంగా ఈడ్చుకుంటూ తన ఛాతీ, పొట్టలో తన్నడం చేసారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. AIIMSలోని జై ప్రకాష్ నారాయణ్ ట్రామా సెంటర్ నుండి వచ్చిన మెడికో-లీగల్ నివేదికలో స్వాతి మలివాల్ ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని తేలింది.
స్వాతి మలివాల్‌కి ప్రాక్సిమల్ లెఫ్ట్ లెగ్ డోర్సల్ యాస్పెక్ట్ పై 3x2 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం ఉందని కుడి కన్ను కింద కుడి చెంపపై 2x2 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం ఉందని నివేదికలో తెలిపారు.