కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సెకన్ల సీసీటీ ఫుటేజ్ శుక్రవారం వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతి మలివాల్ ఇంట్లో నుంచి పంపిచేటప్పుడు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ లు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసింది.
వీడియోలో కేజ్రీవాల్ నివాసంలో నుంచి సెక్యూరిటీ సిబ్బంది స్వాతిని బయటకు పంపిస్తున్నట్లు.. ఇంటి బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది నుంచి విడిపించుకునేందుకు ఆమె ప్రయత్నించినట్టు ఉంది. అనంతరం అక్కడ ఉన్న పోలీసులతో మాట్లాడారు. ‘ఈ వీడియో స్వాతి మలివాల్ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని బట్టబయలు చేస్తుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
स्वाति मालीवाल के आरोपों की असलियत उजागर कर रहा है ये वीडियो ?? pic.twitter.com/dBkH5YhKdD
— AAP (@AamAadmiParty) May 18, 2024
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎంపీని కొట్టారని బీజేపీ నేతలు వీస్తృతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆప్ నేతలు స్పందిస్తూ కేజ్రీవాల్ పై మరో అభియోగం మోపడానికే ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని కామెంట్ చేస్తున్నారు.
