షరతులు వర్తిస్తాయి : విదేశీ విమాన స్వరీసులు రద్దు

షరతులు వర్తిస్తాయి : విదేశీ విమాన స్వరీసులు రద్దు

ప్రపంచ దేశాల్లో కరోనా ఉధృతి రోజురోజుకి  పెరిగిపోతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీచేస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి డిసెంబర్ 31 వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులను రద్దు చేస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సంస్థ నిర్ణయం తీసుకుంది. కేస్ టూ కేస్ పద్దతిలో అప్రూవల్ చేసిన  రూట్లలో మాత్రమే కార్గో, ప్లైట్ సర్వీసులు కొనసాగుతున్నట్లు  డీజీసీఏ చెప్పింది.   మనదేశంలో 9 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా..వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక వందే భారత్ పేరుతో 18దేశాల్లో ప్రత్యేక విమాన సర్వీసులున్నాయి. వాటిని కొనసాగిస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది.