అశ్విన్, బుమ్రా దెబ్బకు ఆసీస్ కుదేలు

అశ్విన్, బుమ్రా దెబ్బకు ఆసీస్ కుదేలు

అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఆకట్టుకుంటోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 244 రన్స్‌‌కే ఆలౌటైంది. బ్యాట్స్‌‌మెన్ మోస్తరుగా రాణించడంతో బౌలింగ్‌‌లో పవర్ చూయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బౌలర్లు తమపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్లే రాణించారు. తొలి ఇన్నింగ్స్‌‌లో 191 రన్స్‌‌కే ఆలౌట్ చేశారు. స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లతో రాణించాడు. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లతో సత్తా చాటారు. ముఖ్యంగా అశ్విన్ తన స్పిన్ వేరియేషన్స్‌‌తో ఆసీస్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ను గడగడలాడించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌‌మెన్‌‌లో మార్నస్ లబుషేన్ (47), టీమ్ పైన్ (73) మాత్రమే రాణించారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌‌కు ఆదిలోనే దెబ్బ పడింది. ఓపెనర్ పృథ్వీ షా 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. నైట్ వాచ్‌‌మెన్‌‌గా వచ్చిన బుమ్రా చివరి వరకు క్రీజులో నిలిచాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌‌ నాటౌ‌‌ట్‌‌గా ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్‌‌కు ఒక వికెట్ దక్కింది.