కొత్త రూల్..పెళ్లి కావాలంటే కోర్సు పాస్ కావాల్సిందే

కొత్త రూల్..పెళ్లి కావాలంటే కోర్సు పాస్ కావాల్సిందే

ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు.. అనిపెద్దలు అంటుంటారు. అవును, మరి రెండూ కష్టమైన పనులే. ఓ అమ్మాయిని ఇంటికి  తెచ్చుకోవాలన్నా, ఆ అమ్మాయిని వేరే ఇంటికి పంపించాలన్నా తల్లిదండ్రులు ఆ కుటుంబం ఏడు తరాల వరకు ఆరా తీయాలంటారు. అన్నీ ఓకే అయితేనే మాటముచ్చట జరిగి, పెళ్లిదాకా పోతుంది. కానీ,ఇండొనేసియాలో పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా కోర్సు చేయాల్సిందే. ఆ కోర్సు పరీక్షలు పాసవ్వాల్సిందే. లేదంటే పెండ్లి జరగదంతే. 2020 నుం చి ఈ కొత్త రూల్ ను అమలు చేస్తామని ఆ దేశ హ్యూమన్ డెవలప్‌‌మెంట్ అండ్ కల్చరల్ ఎఫైర్స్ విభాగం ప్రకటించింది. పెండ్లి చేసుకోవాలంటే భాగస్వామిగా ఎలా ఉండాలో ముం దు నేర్చుకోవాలని. లేకపోతే భవిష్యత్తు ఆగమవుతుందని పేర్కొంది.

ప్రోగ్రామ్‌‌లో భాగంగా ప్రత్యే కంగా 3 నెలల మ్యా రేజ్‌‌ కోర్సును అక్కడి సర్కారు స్టార్ట్‌‌ చేయనుంది. పెండ్లికి ముందు ప్రతి ఒక్కరూ ఈ కోర్సును పూర్తి చేయాలి.ఆ తర్వాత పరీక్ష పెట్టి పాసైనవారికి సర్టిఫికెట్‌‌ ఇస్తారు. అదుం టేనే పెండ్లి చేసుకోవడానికి అర్హులు.కోర్సు ఫ్రీగా ఇస్తారు. సంతానోత్పత్తి, పిల్లల సంరక్షణ చిట్కాలు , రోగాల బారిన పడకుండా ఎలా ఉండాలి లాంటివి ప్రోగ్రామ్‌‌లో భాగంగా నేర్పిస్తారు. కోర్సు లో ఫెయిలైనా, కోర్సు వద్దని తిరస్కరిం చినా పెండ్లి కి అనర్హులని సర్కారు చెప్పింది. పెండ్లి కి ముందు ఇచ్చే కౌన్సిలింగ్‌‌కు దీనికి తేడా ఉందని పేర్కొంది. ఈ నిర్ణయాన్నికొందరు నేతలు తప్పుబడుతున్నా రు. ఇండోనేసియన్‌‌ ఉలేమా కౌన్సిల్‌‌ మాత్రం మతాన్ని ధిక్కరించనంత వరకు ఆ రూల్‌‌కు మద్దతుంటుందని చెప్పింది.