నా పెళ్లికి రండి.. సీఎం జగన్‌కు చందనాదీప్తి ఆహ్వానం

నా పెళ్లికి రండి.. సీఎం జగన్‌కు చందనాదీప్తి ఆహ్వానం

యువ ఐపీఎస్ ఆఫీసర్, మెదక్ జిల్లా ఎస్పీ  చందనాదీప్తి .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ కలిశారు. అతిత్వరలో హైదరాబాద్ లో జరగనున్న తన పెళ్లి వేడుకకు హాజరుకావాలని చందనా దీప్తి … సీఎం జగన్ దంపతులను ఆహ్వానించారు. వైఎస్ జగన్ దగ్గరి బంధువు అయిన బలరాంతో చందనాదీప్తి వివాహం గత నెలలో నిశ్చయమైంది.

తన పెళ్లి రావాలంటూ గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు చందనాదీప్తి. తల్లిదండ్రులతో కలిసి బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ దంపతులను ఆమె కలుసుకున్నారు.

చందనాదీప్తి ఇపుడు మెదక్ జిల్లా ఎస్పీగా ఉన్నారు. విధుల్లో భాగంగా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో “People’s Officer”గా మంచి పేరుంది. వరంగల్ లో పుట్టిన హైదరాబాద్ లో పెరిగారు చందనాదీప్తి. ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. IIT నుంచి IPS వైపు మళ్లిన అతికొద్దిమంది అధికారుల్లో చందనాదీప్తి ఒకరు. 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన చందనాదీప్తి.. SVPNPAలో ట్రెయిన్ అయ్యారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించారు.

చందనాదీప్తి భరతనాట్యం కళాకారిణి. మూడేళ్ల వయసులోనే తాను మొదటి ప్రదర్శన చేసినట్టుగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.