అన్ని కరోనా వేరియెంట్ల నుంచి రక్షణకు యాంటీ బాడీస్

అన్ని కరోనా వేరియెంట్ల నుంచి రక్షణకు యాంటీ బాడీస్

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినప్పటికీ కొత్త వేరియెంట్స్​ వస్తుండడంతో మళ్లీ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. దాంతో వాటిని సమర్థంగా అడ్డుకునే యాంటీబాడీస్ గురించి ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్​ జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్​లోని ‘టెల్ అవివ్ యూనివర్సిటీ’కి చెందిన సైంటిస్ట్​లు ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో రెండు రకాల యాంటీ బాడీస్​ను గుర్తించారు వీళ్లు. ఈ యాంటీ బాడీస్... అన్ని కరోనా వేరియెంట్ల నుంచి దాదాపు 95 శాతం రక్షణ ఇస్తాయని చెప్తున్నారు సైంటిస్ట్​లు. ‘కమ్యూనికేషన్స్ బయాలజీ’ అనే జర్నల్​లో ఈ స్టడీ పబ్లిష్​ అయింది. 

కరోనా నుంచి కోలుకున్న టిఎయు–1109, టిఎయు–2310 అనే యాంటీబాడీస్ గుర్తించారు సైంటిస్ట్​లు. ఇవి కరోనా వైరస్​లో స్పైక్ ప్రొటీన్​కు అతుక్కొని డెల్టాప్లస్, ఒమిక్రాన్ వైరస్​ల పనితీరుని దెబ్బతీయడం గమనించారు. దాంతో ఈ రెండు రకాల యాంటీబాడీస్​ని  కరోనా వచ్చినవాళ్లకు ఎక్కిస్తే  ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ ఉండదు.  

ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్లు, డయాబెటిస్, ఒబెసిటీ, ఎక్కువ కాలం అనారోగ్యంతో బాధ పడుతున్నవాళ్లకు ఈ యాంటీబాడీస్ ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు సైంటిస్ట్​లు. ‘‘టిఎయు–1190 యాంటీబాడీస్​ డెల్టాప్లస్ వేరియెంట్​ని 92 శాతం, ఒమిక్రాన్ వేరియెంట్​ని 90 శాతం అడ్డుకుంటాయని చెప్పింది ఈ రీసెర్చ్​లో పాల్గొన్న నటాలియా ఫ్రండ్ అనే సైంటిస్ట్.