కరోనా బాధితులకు హ్యారీ పోటర్ రైటర్ భారీ విరాళం

కరోనా బాధితులకు హ్యారీ పోటర్ రైటర్ భారీ విరాళం

లండన్: వరల్డ్ ఫేమస్ నావెల్ రైటర్, హ్యారీ పోటర్ సృష్టికర్త జేకే రౌలింగ్ గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా, లాక్​డౌన్ ఎఫెక్టుతో ఉపాధి కోల్పోయిన పేదలకు ఒక మిలియన్ ఫౌండ్లను( రూ. 9,42,60,000) విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. హాగ్వార్డ్స్ స్టోరీ 22వ వార్షికోత్సవం సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు. ‘‘ఈ రోజు హాగ్వార్ట్స్ 22 వ వార్షికోత్సవం, స్టోరీలోని కల్పిత మరణాల గురించి మాట్లాడటం సరికాదు. కరోనా ఎఫెక్టుతో ప్రపంచంలో చాలా మంది వారి ప్రియమైన వారిని కోల్పోతున్నారు”అని రౌలింగ్ ట్వీట్ చేశారు. విరాళంలో సగం కరోనా ఎఫెక్టుతో ఉపాధి కోల్పోయిన కూలీలు, కార్మికులకు.. మరో సగం శరణాలయాకు డొనేట్ చేస్తున్నానని తెలిపారు. ఇలాంటి కష్ట కాలంలో పేద, మధ్యతరగతి ప్రజలు మరింత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.