పంజాబ్ కెప్టెన్ గా రాహుల్.?

పంజాబ్ కెప్టెన్ గా రాహుల్.?

ఐపీఎల్.. ప్రతీ యేటా సమ్మర్ వచ్చిందంటే అందరి చూపు  దానిపైనే. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఐపీఎల్ ప్రాంఛైజీలు కూడా జట్టుల్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. అయితే ఈ సారి 2020లో జరిగే ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో కీలక మార్పు జరగబోతుందని సమాచారం. ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న రవిచంద్ర అశ్విన్ ను తప్పించి అదే జట్టులో ఉన్న కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా నియమించాలనే యోచనలో పంజాబ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో  పంజాబ్ జట్టు యాజమాన్యం భేటీ కానుంది. భేటీ తర్వాత కెప్టెన్సీపై క్లారిటీ వస్తుంది. అశ్విన్ గత రెండు సీజన్ లుగా పంజాబ్ కు కెప్టెన్ గా ఉన్నాడు. రెండు సీజన్లో కూడా పంజాబ్ ఫేలవమైన ప్రదర్శన చేసింది. పంజాబ్ తరపున 28 మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 25 వికెట్లు తీశాడు. 2018 వేలంలో  పంజాబ్ అశ్విన్ ను రూ. 7.8 కోట్లు పెట్టి దక్కించుకుంది. మరో వైపు కేఎల్ రాహుల్ గత ఐపీఎల్ తో పాటు ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో కూడా రాణించాడు. దీంతో పంజాబ్ రాహుల్ వైపు చూస్తుంది.