విశ్వ విజేతగా కోనేరు హంపి.. చెస్‌లో కొత్త చరిత్ర

విశ్వ విజేతగా కోనేరు హంపి.. చెస్‌లో కొత్త చరిత్ర

మాస్కో: గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరో ప్రతిష్టాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి స్వర్ణ పతకం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. 12 రౌండ్లలో సాగిన ఈ టోర్నిలో హంపి 9 పాయింట్లు సాధించి టైటిల్‌ను దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో చైనాకు చెందిన లీ తింగ్‌జీ, రష్యాకు చెందిన ఎక్తరీనా అట్లికాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. లీ తింగ్‌జీ గట్టి పోటీ ఇవ్వడంతో హంపి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. డ్రా అయ్యే సమయానికి స్కోర్ ఆధారంగా హంపిని విజేతగా ప్రకటించారు. దాంతో వరల్డ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నతొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా హంపి తన పేరును లిఖించుకుంది.

తల్లి అయిన తరువాత రెండు సంవత్సరాల పాటు విరామం తీసుకొని, ఆ తర్వాత మళ్లీ కెరీర్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలవడం మరో విశేషం.

కాగా.. పురుషుల చాంపియన్‌షిప్‌ను మాగ్నస్ కార్ల్‌సన్ గెలుచుకున్నాడు. ఈ టైటిల్ గెలవడం మాగ్నస్‌కి ఇది ముచ్చటగా మూడోసారి. ఆయన గతంలో 2014 మరియు 2015 ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌ టైటిళ్లను గెలుచుకున్నాడు.