రిటైర్మెంట్పై మెస్సీ కీలక ప్రకటన

రిటైర్మెంట్పై మెస్సీ కీలక ప్రకటన

ఫుట్బాల్ లెజెండ్ ..అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్..లియోనెల్ మెస్సీ..రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశాడు. ఖతార్ 2022 ఫిఫా వరల్డ్ కపే చివరి వరల్డ్ కప్ అని చెప్పేశాడు. తాను శారీరకంగా బాగానే ఉన్నానని..అయితే ఇదే తన చివరి వరల్డ్ కప్ అని ప్రకటించాడు. 

ఒత్తిడికి గురవుతున్నా..


ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్లో మ్యాచులన్నీ చాలా ఉత్కంఠగా జరుగుతాయి. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన అన్నీ జట్లకు గెలుపు సొంతం కాకపోవచ్చు. అయితే ఈ వరల్డ్ కప్లో మాత్రం అర్జెంటీనా కూడా ఫేవరెట్ అని అనుకుంటున్నా..ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం..అర్జెంటీనాకు ఎక్కువ విజయావకాశాలున్నాయి..నా కెరియర్లో ఇదే చివరి వరల్డ్ కప్. ఈ సమయంలో ఆందోళనకు, ఒత్తిడి గురవుతున్నా... అని మెస్సీ వెల్లడించాడు.

మెస్సీకి 5వ వరల్డ్ కప్


లియోనల్ మెస్సీ ఇప్పటి వరకు నాలుగు ఫిఫా వరల్డ్ కప్లలో పాల్గొన్నాడు. 2006, 2010, 2014,2018 ప్రపంచ కప్‌లలో అతను ఆడాడు. ఈ ఏడాది ఖతార్లో జరిగే వరల్డ్ కప్ మెస్సీకి ఐదవ  ఫిఫా వరల్డ్ కప్. 

రెండు సార్లు విజేత..రెండు సార్లు రన్నరప్...


మరోవైపు అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్..రెండు సార్లు ఫిఫా వరల్డ్ కప్లో విజేతగా నిలిచింది. 1978, 1986 ప్రపంచకప్‌లను సొంతం చేసుకుంది. 1930, 2014 ఆ జట్టు రన్నరప్గా నిలిచింది. 2022 ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అర్జెంటీనా  సౌదీ అరేబియాతో మ్యాచ్ ఆడబోతుంది. ఆ తర్వాత మెక్సికో, పోలండ్‌తో తలపడుతుంది.