ఆదిలాబాద్ లో లాక్ డౌన్ మరింత కఠినతరం

ఆదిలాబాద్ లో లాక్ డౌన్ మరింత కఠినతరం

లాక్ డౌన్ మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాను అరికట్టేందుకు రాష్ట్రంలో ఈ నెల 21 వరకు పది రోజుల పాటు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం..ఆ తర్వాత ఈ నెల 30 వరకు పొడగించింది. అనవసరంగా రోడ్లపైకి రావడం..లాక్ డౌన్ టైంలో వాహనాలపై బయట తిరిగితే కఠిన చర్యలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు పోలీసు అధికారులు. అత్యవసరమైన వాటికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగానే.. అదిలాబాద్ జిల్లా లాక్ డౌన్ బందోబస్తు పోలీసు అధికారులతో జిల్లా ఇంచార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర అత్యవసర సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ మరింత కఠినతరం చేయాలని ఆదేశించారు. పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థలు ఉదయం 9:30 నుండి ఉదయం 9.45 లోపు మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలంతా 10 గంటల లోపు ఇంటికి చేరుకోవాలన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని ప్రధాన సెంటర్లు దిగ్బంధం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.