రష్యాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం (అక్టోబర్16) కమ్చట్కా రీజియన్ లో రిక్టర్ స్కేల్ పై 7.0 భూకంప తీవ్రతతో భూమికి సుమారు 152 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘటనతో సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు.జాతీయ భూకంప కేంద్రం వివరాల ప్రకారం, శుక్రవారం భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 9:05 గంటలకు భూకంపం సంభవించింది.
భూకంపం తరువాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, భూకంపంతో నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
