మృతుల కుటుంబాల‌కు ఆడియో ద్వారా మావోల‌ క్ష‌మాప‌ణలు‌

మృతుల కుటుంబాల‌కు ఆడియో ద్వారా మావోల‌ క్ష‌మాప‌ణలు‌

వైజాగ్: ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబ సభ్యులకు క్షమాపణలు కోరుతూ ఆడియో టేప్ విడుదల చేశారు మావోలు. ఇటీవల విశాఖ మన్యంలో ప్రమాదవశాత్తు బాంబ్ పేలి మృతి చెందిన పెదబయలు మండల ప్రాంతం జాముగుడా పంచాయితీకి చింతలవీధి గ్రామానికి చెందిన మోహనరావు, అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు మమ్మల్ని మన్నించాలని కోరుతూ పెదబయలు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సుధీర్ ఆడియో టేపును మీడియాకు విడుదల చేశారు. ఆగస్ట్ ఒకటవ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి నిజ నిజాలు ప్రజలకు మీడియా ద్వారా ప్రజలకు తెలియపర్చాలని ఆడియోలో మావోలు పేర్కొన్నారు.

మృతి చెందిన వారికి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని మావోలు తెలిపారు. మృతి చెందిన ఇరువురు తమ కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే అంశాన్ని ఆడియో వివరించారు. జులై 19 వ తేదీన లండులు వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు తమను చుట్టుముట్టిన నేపథ్యంలో వారిని ప్రతిఘటించే క్రమంలో ప్రాణ రక్షణ కొరకు ఏర్పాటు చేసిన మందుపాత్ర పేలి తమ కుటుంబీకులను కోల్పోవడం జరిగిందన్నారు. దీనిని ఆసరాగా తీసుకుని పోలీసులు తమపై గ్రామాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పెదబయలు కోరుకొండ కమిటీ కార్యదర్శి సుధీర్ ఆడియోలో వివరించారు.