మైఖేల్ జాక్స‌న్ కూతురు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం?

మైఖేల్ జాక్స‌న్ కూతురు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం?

మైఖేల్ జాక్సన్ కూతురు 20 ఏళ్ల ప్యారిస్ జాక్సన్ లాస్ ఏంజల్స్ లోని తన ఇంట్లో చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం శనివారం ఈ సంఘటన జరిగింది. ప్యారిస్ జాక్సన్ సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత.. సన్నిహితులు హాస్పిటల్ లో జాయిన్ చేశారని అమెరికన్ వెబ్ సైట్లు చెప్పాయి. 2013 లోనూ  ఒకసారి ప్యారిస్ జాక్సన్ సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు న్యూస్ వచ్చింది.

లీవింగ్ నెవర్ ల్యాండ్ వివాదం

కానీ ప్యారిస్ జాక్సన్ మాత్రం తనపై వస్తున్న వార్తలని ఖండిస్తోంది. మీడియా సంస్థలు మాత్రం ప్యారిస్ జాక్సన్ ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించిందో కూడా రాసేస్తున్నాయి. ప్యారిస్ తన తండ్రి మైఖేల్ జాక్సన్ పై వస్తున్న ఓ వార్తతో మనస్తాపానికి గురైందని, దీంతో సూసైడ్ కు ప్రయత్నించిందని అంటున్నారు.

మైకేల్ జాక్సన్ జీవితంపై లీవింగ్ నెవర్ ల్యాండ్ అనే డాక్యుమెంటరీ రూపొందింది. మైకేల్ జాక్సన్ ఇద్దరు టీనేజ్ యువకులపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ డాక్యుమెంటరీలో ఉంది. ఆ విషయం బయటకు రావడంతో ప్యారిస్ జాక్సన్ తీవ్ర మనోవేదనకు గురైందట. తన తండ్రి ప్రతిష్టని దిగజార్చుతున్నారనే కోపంతో సూసైడ్‌కు ప్రయత్నించినట్టుగా వార్తలొచ్చాయి.