ప్రశ్నించే వారిపై ఈడీ కేసులు పెడుతున్నరు

ప్రశ్నించే వారిపై ఈడీ కేసులు పెడుతున్నరు

తెలంగాణ ప్రజల కోసం కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని.. కేసీఆర్ కు ప్రజలు దైర్యం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టి శ్రీరామ్ అంటూ వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 2 వేల ఫించన్ రూ. 500 తగ్గుతుందని.. అలాగే.. 24 గంటల కరెంటు ఉండదు, కళ్యాణలక్ష్మీ ఇతర పథకాలు ఉండవన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో ఆయన మాట్లాడారు..ప్రశ్నించే వారిపై ఈడీ కేసులు పెడుతున్నారని.. కేసీఆర్ లాగే ఢిల్లీ సీఎం క్రేజివాల్ కూడా దేశ అభివృద్ధిపై ప్రశ్నిస్తుంటే.. వారి పార్టీకి చెందిన వారిపై ఈడీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వారితో పాటు కవితను అందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ పార్టీలో చేరాలి లేకుంటే ఈడీ కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. గుజరాతీలైన నరేంద్రమోడీ, అమిత్ షా ఇప్పుడు తెలంగాణ మీద పడ్డారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇతర పార్టీల సీఎంలను దింపి వారి ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం..వారికి నచ్చిన వారికి  ముఖ్యమంత్రులుగా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళుతున్న క్రమంలో పువ్వు, చేయి గుర్తులు వస్తే ఆగమవుతామన్నారు. 2010లో 2జీ స్పెక్ట్రం లక్ష 50 వేలకు కేంద్రం వేలం వేస్తే లోలోపల కుమ్మక్కై.. ఈ సంవత్సరం 5జీ స్పెక్ట్రం వేలం లక్ష 50 వేలకు వేలం వేశారని విమర్శించారు. దేశంలో ప్రతి కంపెనీలను అదాని, అంబానీలకు అప్పజెప్పుతున్నారన్నారు