మరో 10 సార్లు సీఎం అయినా కేసీఆర్ కు పోటీ కాదు

మరో 10 సార్లు సీఎం అయినా కేసీఆర్ కు పోటీ కాదు

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై రాష్ట్ర మంత్రులు ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ ను విమర్శించే అర్హత శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేదన్నారు. ఏ రంగంలో మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించిందో శివరాజ్ సింగ్ చెప్పాలని మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని దొడ్డిదారిన శివరాజ్ సీఎం అయ్యారన్నారు. మధ్యప్రదేశ్ లో పాలన నచ్చకనే చాలామంది మా రాష్ట్రానికి వలస వచ్చి బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాల కోసం బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. మధ్యప్రదేశ్ అభివృద్ధి.. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. శివరాజ్ మరో 10సార్లు సీఎం అయినా కూడా టీఆర్ఎస్ పాలనతో పోటీ పడలేరన్నారు.