ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. 14న పోలింగ్

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. 14న పోలింగ్

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మార్చి 14న పోలింగ్  జరగనుండటంతో 48 గంటల ముందే ప్రచారం ముగిసింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఆసాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా మంత్రులు, ఆయా పార్టీల ముఖ్య నేతలు తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు.

ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సందర్భంగా లిక్కర్ షాపులపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 14న సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని.. మళ్లీ ఓట్ల లెక్కింపు రోజైన 17న మూసివేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడంతో... అందుకు తగ్గట్లుగానే జంబో బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు.