అందాల పోటీలో ఓ అభ్యర్థి చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగాలాండ్‌లో ‘మిస్ కోహిమా 2019’ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో 18 ఏళ్ల వికునావో సచు అనే యువతి పాల్గొంది. ఇందులో భాగంగా న్యాయ నిర్ణేతలు వికునావో ను ప్రశ్నించారు. ప్రధాన మంత్రికి మీరిచ్చే సలహా ఏంటి అని అడిగారు. దానికి ఆ యువతి ‘మోడీజీ మీరు ముందు మహిళల రక్షణ పై దృష్టి పెట్టండి ఆ తర్వాత ఆవుల గురించి పట్టించుకోండి’ అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ పోటీలో సచు రెండో స్థానంలో నిలిచారు.
