మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. డిసెంబర్-30న డ్రాఫ్ట్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్న ఈసీ.. డిసెంబర్-31 నుంచి జనవరి- 2 వరకు అభ్యంతరాలకు గడువు కోరనుంది.

ఈ క్రమంలోనే డిసెంబర్- 31న జిల్లా అధికారులతో రాజకీయ పార్టీల సమావేశం ఉంటుంది. జనవరి- 1న మున్సిపల్ కమిషనర్ల స్థాయిలో రాజకీయ పార్టీల సమావేశం.. 3న అభ్యంతరాలపను పరిష్కరిస్తారు. జనవరి7న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. జనవరి 10న నామినేషన్లకు చివరి తేదీ. జనవరి 11న నామినేషన్ల పరిశీలన. జనవరి 14న ఉపసంహరణకు ఫైనల్ గడువు. జనవరి 22న పోలింగ్‌. జనవరి 25న ఓట్ల లెక్కింపు. జనవరి- 4న ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపింది రాష్ట్ర ఎన్నికల సంఘం.