ఆన్‌లైన్‌లో టెర్రరిజంపై ప్రచారం.. హైదరాబాదీ అరెస్ట్

ఆన్‌లైన్‌లో టెర్రరిజంపై ప్రచారం.. హైదరాబాదీ అరెస్ట్

సోషల్ మీడియాలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ, పాక్ అనుకూల టెర్రరిజానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో పోస్టులు పెడుతూ ప్రచారం అతడు ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించేలా ప్రయత్నిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం, పోస్టులు పెడుతున్న ఆ వ్యక్తిని హైదరాబాద్‌లోని పాతబస్తీ వాసిగా ఐడెంటిఫై చేశామన్నారు. అతడి పోస్టులను సోషల్ మీడియాలో గుర్తించి,  కేసు నమోదు చేసి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా ట్రేస్ చేశామన్నారు. అతడి పేరు సులేమాన్ అని, నిన్న రాత్రి అరెస్ట్ చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు రిఫరీగా తెలుగు మహిళ

వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్