
పుణే: పంప్‌లు, వాల్వ్‌ల తయారీ సంస్థ కేఎస్‌బీ లిమిటెడ్ మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 7.75 శాతం వృద్ధితో రూ. 43.1 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది కాలంలో రూ. 40 కోట్ల నికర లాభం వచ్చింది.
ఈ కంపెనీ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్థిక సంవత్సరంగా పాటిస్తుంది. మార్చి క్వార్టర్‌లో కంపెనీ ఖర్చులు ఏడాది క్రితం రూ.432.4 కోట్ల నుంచి రూ.483.3 కోట్లకు పెరిగాయి. అమ్మకాల ఆదాయం.489.6 కోట్లునుంచి రూ.544.2 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రకటించింది.