సమస్యలు తీర్చకుంటే సమ్మెకు వెళతాం..

సమస్యలు తీర్చకుంటే సమ్మెకు వెళతాం..
  •  ప్రభుత్వానికి పంచాయతీ కార్మికుల హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే జులై 6 నుంచి సమ్మె చేయనున్నట్లు గ్రామ పంచాయతీ కార్మికులు తెలిపారు. పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఇదివరకే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 24 న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 5న పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంతరావుకు సమ్మె నోటీసు ఇవ్వగా, శనివారం మరోసారి కలిసి సమస్యలను వివరించారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించి, మిగతావి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డైరెక్టర్ చెప్పినట్లు జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్ తెలిపారు.