ఒక్క నెలలో లక్ష ఉద్యోగాలు ఏమైనయ్

ఒక్క నెలలో లక్ష ఉద్యోగాలు ఏమైనయ్

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చెయ్యటం లేదంటూ పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డి జాతీయ మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేశారు. ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయ్యకపోవటం వల్ల లక్షల మంది నిరుద్యోగులు వయోభారంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.  లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కాళీగా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం నోటిపికేషన్ విడుధల చేయ్యటం లేదని మండిపడ్డారు హర్షవర్ధన్.  స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో లక్ష పదిహేడు వేలు ఉద్యోగాలను ఒక్క నెల లోపల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మాటను గాలికొదిలేసారని అన్నారు.  నిధులు, నియామాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర  ఉద్యమం జరిగిందని, కాని  కేసీఆర్ ప్రభుత్వం  ప్రస్తుతం దానికి బిన్నంగా వ్యవహరిస్తుందని హర్షవర్ధన్ అన్నారు.