అన్ని వర్గాల కలలు సాకారం చేసే బడ్జెట్ : మోడీ

అన్ని వర్గాల కలలు సాకారం చేసే బడ్జెట్ : మోడీ

ఏడు అంశాలు ప్రాధాన్యంగా రూపొందించిన బడ్జెట్ కొత్త ఇండియాకు గట్టి పునాది అవుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందించిన ఈ బడ్జెట్ అన్ని వర్గాల కలలను సాకారం చేస్తుందని చెప్పారు. మహిళా సాధికారత కోసం నిధులు కేటాయించడంతో పాటు పీఎం విశ్వకర్మ ప్రోత్సాహకాన్ని ప్రకటించినట్లు చెప్పారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు మరో ఏడాది పొడిగించామని అందుకోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించామని అన్నారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన శ్రీ అన్న పథకం అద్భుతమని మోడీ ప్రశంసించారు. 

ఉద్యానవన పంటలకు చేయూత అందించడంతో పాటు వ్యవసాయ స్టార్టప్ లకు ప్రత్యేక నిధి కేటాయించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఫార్మా రంగం అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్న ఆయన.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు పాన్ కార్డును చేస్తామని అంగీకరించనున్నట్లు మోడీ స్పష్టం చేశారు.