కోచ్‌‌ లేకుండా చాంపియన్‌‌ అవ్వలేరు

కోచ్‌‌ లేకుండా చాంపియన్‌‌ అవ్వలేరు

హైదరాబాద్‌‌, వెలుగు:  ఇండియా చీఫ్‌‌ బ్యాడ్మింటన్‌‌ కోచ్‌‌ పుల్లెల గోపీచంద్‌‌ తన జీవిత విశేషాలను పుస్తక రూపంలోకి తెచ్చాడు. ‘షట్లర్స్‌‌ ఫ్లిక్‌‌; మేకింగ్‌‌ ఎవ్రీ మ్యాచ్‌‌ కౌంట్‌‌’ పేరుతో ప్రియా కుమార్‌‌తో కలిసి రాసిన ఆటో బయోగ్రఫీని  శుక్రవారం నగరంలో లాంఛ్‌‌ చేశాడు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ ఐటీ మినిస్టర్‌‌ కేటీఆర్‌‌తో కలిసిఇష్టాగోష్టిగా మాట్లాడిన గోపీ.. ఓ ప్లేయర్‌‌ నుంచి కోచ్‌‌గా తన ప్రయాణం, సైనా, సింధు, శ్రీకాంత్‌‌ వంటి చాంపియన్లను తయారు చేసే క్రమంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకున్నాడు. కోచ్‌‌ లేకుండా ఎవ్వరూ చాంపియన్‌‌ అవ్వలేరని అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్‌‌తో సహా ఏ ఫీల్డ్‌‌లో అయినా గురువు లేకుండా చాంపియన్‌‌షిప్‌‌ లెవెల్‌‌కు వెళ్లడం దాదాపు అసాధ్యమన్నాడు.  ఒక కోచ్‌‌గా ఉండటం అత్యంత బాధ్యతాయుతమైన స్థానమని గోపీ అభిప్రాయపడ్డాడు. ఓ కోచ్‌‌గా తాను ప్లేయర్లకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని చెప్పాడు. తన పని బ్యాడ్మింటన్‌‌  కోర్టులో మొదలై అక్కడే ఆగిపోదని.. కోర్టు అవతల కూడా కొనసాగుతుందని గోపీ స్పష్టం చేశాడు.