కరోనా ఎఫెక్ట్ : ప్రభాస్, పూజా హెగ్డే కు మాస్క్ తొడిగిన పోలీసులు

కరోనా ఎఫెక్ట్ : ప్రభాస్, పూజా హెగ్డే కు మాస్క్ తొడిగిన పోలీసులు

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కొత్త మూవీ ఫస్ట్‌లుక్ శుక్ర‌వారం విడుదలైంది. ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ప్రభాస్- పూజా హెగ్డే రొమాంటిక్ స్టిల్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్ట‌ర్ చూసిన అస్సాంలోని నాగాన్ పోలీసులు పోస్ట‌ర్ పై ఓ స‌ర‌దా ట్వీట్ చేశారు.

దేశంలో క‌రోనా విలయతాండవం చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించాలంటూ…’రాధే శ్యామ్’ సినిమా పోస్ట‌ర్‌ను తమ కోవిడ్ 19 ప్రచారం కోసం వాడుకున్నారు. ట్విట‌ర్‌లో… మీ ప్రియమైన వారు బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్ పెట్టుకోమ‌ని చెప్పండి. మేం ప్రభాస్‌కి చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాం , కాని విఫలమయ్యాం. ఇప్పుడు ఫోటోషాప్ ద్వారా సందేశం పంపుతున్నాం అంటూ పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ పూజా హెగ్డెల‌కు మాస్క్‌ల‌తో ఫోటోషాప్ చేసి పోస్ట్ చేశారు.

క‌రోనాపై ప్ర‌‌జ‌ల‌కు అవ‌గాహాన క‌ల్పించేందుకు ఇలా వెరైటీ సందేశం అందించిన పోలీసుల ప్రతిభను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. దీనిపై ‘రాధే శ్యామ్’ మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.