రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోర్ వివాదాస్పద కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. పాకిస్థాన్, అమెరికాల మధ్య యుద్ధం వస్తే భారత్.. పాకిస్థాన్ పక్షాన నిలబడాలని రాజస్థాన్ బీజేపీ చీఫ్ మదన్ రాథోర్ అనడంతో, కాంగ్రెస్ నేతలు ఇతర రాజకీయ ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
మదన్ రాథోర్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక సామీప్యంపై మాట్లాడిన రాథోర్.. పాకిస్తాన్ మన పొరుగు దేశం..ఒకవేళ అమెరికాకు, పాకిస్తాన్ కు యుద్దం వస్తే మనం పాకిస్తాన్ తోనే ఉంటామని అన్నారు. మనలో మనకే ఏదైన సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనం భారత్ కు అండగా ఉంటాం..మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే.. మదన్ రాథోర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ పై రాథోర్ వైఖరిని ప్రశ్నించారు. రాథోర్ వ్యాఖ్యలను దేశద్రోహపూరిత వ్యాఖ్యలు అతడిపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ ప్రశ్నించారు.
అతని వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు మరియు ఇతర రాజకీయ ప్రముఖుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి, వారు పాకిస్థాన్పై అతని వైఖరిని ప్రశ్నించారు.
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ ఈ వ్యాఖ్యలను దేశద్రోహమైనవిగా అభివర్ణించి, తమ రాజస్థాన్ అధ్యక్షుడిపై బీజేపీ ఎలాంటి చర్య తీసుకుంటుందని ప్రశ్నించారు.
మన సైనికులను , మన ప్రజలను చంపే ఉగ్రవాద దేశానికి బీజేపీకి ఉన్న ప్రేమ మరోసారి బట్టబయలైందన్నారుషామా.ప్రధాని మోదీ, అమిత్ షా కూడా పాకిస్తాన్ తో ఉన్నారా లేకపోతే ఈ దేశ ద్రోహిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు చెప్పాలని డిమాండ్ చేశారు.ఇక మదన్ రాథోర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. రాథోర్ వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు.
