నగరంలో పెరిగిపోతున్న విష సంస్కృతి..

నగరంలో పెరిగిపోతున్న విష సంస్కృతి..

హైదరాబాద్ లో రోజు రోజుకు విష సంస్కృతి పెరిగిపోతున్నది. పబ్బులలో అశ్లీల నృత్యాలు.. అసాంఘీక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. యువత మద్యానికి బానిసలై విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఇటీవల జూబ్లీహిల్స్ లో జరిగిన మైనర్ బాలిక ఘటనే సాక్ష్యం. నగరంలో యువత పబ్ కల్చర్ ను నేర్చుకుంటున్నారు. అయితే ఒకప్పుడు బార్ లలో ఉన్న అశ్లీల నృత్యాల సంస్కృతి ఉండేది.. వాటిని పోలీసులు,ప్రభుత్వం బంద్ చేయిచడంలో సఫలం అయ్యారు. కానీ నగరంలోని కొన్ని రిసార్టులో,హోటల్లలో,పబ్బులో ఇలాంటి డాన్స్ లను గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సంస్కృతి పబ్బులో ఉండడం కాదు.. ఇంటిముందుకే రావడంతో అంతా ఆశర్యానికి లోనయ్యారు. ఓ ప్రబుద్దుడు ఏకంగా ఇంటిముందే రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేశాడు.  

వివారాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజు మియా తాబేలా అనే ప్రాంతంలో ఓ యువకుడు జన్మదిన వేడుకలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు మొదలై తెల్లవారుజాము వరకు ఈ వేడుకలు చేశారు. ఇందులో బ్యాండ్,డీజె సౌండ్ సిస్టంలో పాటలను పెట్టడం కాకుండా ఏకంగా డ్యాన్సర్లను పెట్టి ఇంటి ముందు నృత్యాలు చేయించారు. ఈ ఘటన స్థానికులు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ వేడుకలు సాక్షాతూ బర్త్ డే బాయ్ తండ్రి అరిఫ్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అరిఫ్ కు రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లో పోలీసులతో మంచి పరిచయాలు ఉండడంతో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపుతున్నారు.