కొత్త రూల్..కావాలని దగ్గితే రెడ్‌ కార్డే..

కొత్త రూల్..కావాలని దగ్గితే రెడ్‌ కార్డే..

జురిచ్‌: దగ్గు అనేది ఇన్నాళ్లూ చాలా చిన్న విషయం. కానీ కరోనా దెబ్బకుపరిస్థితి మారిపోయింది. దగ్గుతున్న వ్యక్తిని చూస్తే భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది.ఈ నేపథ్యంలో ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌లో కొత్త నిబంధన ను చేర్చారు. ఎవరైనా ప్లేయర్‌‌‌‌ ఇతర ఆటగాళ్లు లేదా మ్యాచ్‌‌‌‌ అఫీషియల్స్ వద్ద కావాలని దగ్గితేగ్గి రెడ్‌‌‌‌ కార్డు ఎదుర్కోవాల్సిందే. ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌లా మేకర్‌‌‌‌ అయిన ‘ ద ఇంటర్నేషనల్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ బోర్డు(ఐఎఫ్‌‌‌‌ఏబీ)’ ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో ఈ రూల్‌‌‌‌ కింద రెఫరీ మాత్రమే ప్లేయర్‌‌‌‌కు రెడ్‌‌‌‌ కార్డు ఇవ్వగలడు. ఎల్లో కార్డు కూడా ఇచ్చేందుకు అవకాశముంది. సహచర ప్లేయర్‌‌‌‌కు సమీపంలో మరో ఆటగాడు దగ్గితేగ్గి దానిని నేరంగా పరిగణిస్తామని ఐఎఫ్‌‌‌‌ఏబీ స్పష్టం చేసింది.ఘటన అనుకోకుండాజరిగినా,మిగిలిన వాళ్ళకు దూరంగా దగ్గిన సందర్భాల్లోప్లేయర్‌‌‌‌పై రెఫరీ చర్యలు తీసుకోడని ఐఎఫ్‌‌‌‌ఎబీ స్పష్టం చేసింది.