రాష్ట్రంలో పేదలకు కేంద్రం బియ్యం

రాష్ట్రంలో పేదలకు కేంద్రం బియ్యం

2.87లక్షల టన్నులు కేటాయింపు
వెల్లడించిన ఎఫ్‌సీఐ

హైదరాబాద్‌, వెలుగు: ప్రధాన మంత్రి కళ్యాణ్ యోజన ద్వారా కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణీకి 2.05 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్రానికి అందించినట్లు ఎఫ్‌సీఐ వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రాష్ట్రంలోని నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రతి లబ్ధిదారునికి 5 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నట్లు ఎఫ్‌సీఐ డీజీఎం విక్టర్ అమల్‌రాజ్‌ బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని 1.91 కోట్లమందికి ప్రతి నెలా 95,810 టన్నుల బియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. మూడు నెలలకు అవసరమైన 2.87 లక్షల టన్నుల బియ్యంలో కేంద్రం 2.05 లక్షల టన్నులు పంపిణీ చేసిందని తెలిపారు.