లారా రికార్డ్‌‌ బ్రేక్‌‌ చేసే సత్తా రోహిత్‌‌కే

లారా రికార్డ్‌‌ బ్రేక్‌‌ చేసే సత్తా రోహిత్‌‌కే

అడిలైడ్‌‌‌‌: టెస్టుల్లో చెక్కుచెదరని వెస్టిండీస్‌‌‌‌ దిగ్గజం బ్రియన్‌‌‌‌ లారా(400 నాటౌట్‌‌‌‌) హైయ్యెస్ట్  స్కోర్‌‌‌‌‌‌‌‌ రికార్డును బ్రేక్‌‌‌‌ చేసే సత్తా టీమిండియా ఓపెనర్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మకే ఉందని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌‌‌‌తో జరుగుతున్న డేనైట్ టెస్ట్‌‌‌‌లో అజేయ ట్రిపుల్‌‌‌‌ సెంచరీ సాధించిన వార్నర్‌‌‌‌‌‌‌‌.. టీమ్ పెయిన్‌‌‌‌ డిక్లెర్ నిర్ణయంతో లారా రికార్డుకు 65 రన్స్‌‌‌‌ దూరంలో నిలిచిపోయాడు. అయితే ఏదో ఒకరోజు ఈ రికార్డు బద్దలవుతుందన్న ఈ స్టార్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌.. అది కూడా రోహిత్ శర్మనే చేస్తానన్నాడు. ఇక  టెస్ట్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌పై తనకు సందేహాలున్నప్పుడు టీమిండియామాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌‌‌‌ తీర్చాడని, టీ20ల్లో  కన్నా తాను టెస్ట్‌‌‌‌ల్లోనే ఉత్తమంగా రాణిస్తానని అంచనా వేశాడని గుర్తు చేసుకున్నాడు.  ‘సెహ్వాగ్‌‌‌‌ నాతో ఎప్పుడూ ఒకే విషయం ఎక్కువగా చెబుతూ ఉండేవాడు..‘స్లిప్‌‌‌‌, గల్లీ, కవర్స్, మిడ్‌‌‌‌ వికెట్‌‌‌‌, మిడాఫ్‌‌‌‌, మిడాన్‌‌‌‌ లో ఫీల్డింగ్‌‌‌‌ ఉంటారు. వారిపై నుంచి షాట్లు ఆడితే ఆరోజంతా నీదే అని చెప్పేవాడు. ఇదే నా మనసులో పాతుకుపోయింది. దాంతోనే టెస్టుల్లో రాణిస్తున్నా’ అన్నాడు.