కాకతీయ టెక్స్​టైల్​ పార్క్​కు రూ. 900 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్

కాకతీయ టెక్స్​టైల్​ పార్క్​కు రూ. 900 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్

ముందుకు వచ్చిన కొరియా సంస్థ యంగ్వాన్​
12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి: మంత్రి కేటీఆర్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : వరంగల్‌‌‌‌లోని కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు కొరియా దిగ్గజ టైక్స్‌‌‌‌టైల్స్‌‌‌‌ సంస్థ యంగ్వాన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ముందుకు వచ్చింది. రూ.900 కోట్లు ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఓ హోటల్​లో మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి దయాకర్​తో సంస్థ చైర్మన్​ కిహాక్​సుంగ్, ఇతర ప్రతినిధులు భేటీ అయ్యారు.  ఇండియా, కొరియా ఎంబసీ ప్రతినిధుల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంగ్వాన్‌‌‌‌ కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారు. టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌లో రూ.900 కోట్ల పెట్టుబడితో యాంకర్‌‌‌‌ యూనిట్‌‌‌‌ను స్థాపిస్తామని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసం 290 ఎకరాల భూమిని కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వం సంబంధిత డాక్యుమెంట్లను కూడా అందజేసింది. స్థానికంగా లభించే పత్తితో నాణ్యమైన  వస్త్రాల తయారే లక్ష్యంగా పనిచేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్‌‌‌‌ తెలిపారు. గుజరాత్‌‌‌‌లో 2017లో జరిగిన టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ సమ్మిట్‌‌‌‌లో యంగ్వాన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌తో తాను సమావేశమై టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌లో పెట్టుబడుల కోసం ఆహ్వానించానన్నారు. యంగ్వాన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌‌‌‌, వియత్నాం, ఇథియోపియా తదితర 13 దేశాల్లో యంగ్వాన్‌‌‌‌ 90 వేల మంది కార్మికులతో యూనిట్లు నిర్వహిస్తున్నదన్నారు.  వరంగల్‌‌‌‌లో యూనిట్‌‌‌‌ ఏర్పాటుకు ప్రభుత్వం 99 శాతం కృషి చేసిందని,  తమ ప్రయత్నం ఒక్క శాతమేనని  తెలిపారు. ఏడాదిలోగా తమ యూనిట్‌‌‌‌లో ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. యంగ్వాన్‌‌‌‌ రాకతో వరంగల్‌‌‌‌ టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌ ముఖచిత్రమే మారిపోతుందని, వరంగల్‌‌‌‌ యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సమావేశంలో ఇండస్ట్రీస్‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ జయేశ్‌‌‌‌ రంజన్‌‌‌‌, కొరియాలో భారత రాయబారి సుప్రియ రంగనాథ్‌‌‌‌, కొరియా కాన్సుల్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఇన్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ సురేశ్‌‌‌‌ చుక్కపల్లి, టైక్స్‌‌‌‌టైల్‌‌‌‌ శాఖ డైరెక్టర్‌‌‌‌ శైలజా రామయ్యర్‌‌‌‌, టీఎస్‌‌‌‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.