ఆరోగ్యవంతమైన వెంట్రుకలకు FISH ఆయిల్…

ఆరోగ్యవంతమైన వెంట్రుకలకు FISH ఆయిల్…

ఆరోగ్యవంతమైన వెంట్రుకలకోసం… ఫిష్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు న్యూట్రీషన్లు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రీషన్స్ ఉంటాయని చెప్తున్నారు. ఊడిపోతున్న వెంట్రుకలకు, మెంటల్ హెల్త్‌కు, క్రోనిక్ డిసీజెస్‌లకు ఫిష్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ముఖ్యంగా వెంట్రుకల ఎదుగుదలకు, బలానికి, జుట్టు కుదుళ్లకు ఇది ముఖ్యమైన మెడిసిన్ అని తెలిపారు.

చేప నూనె అనేది..  చేప కణజాలం నుండి సేకరించిన నూనె లేదా కొవ్వు. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల అధిక సాంధ్రత కారణంగా ఇది మరింత ప్రాచుర్యం పొందింది.

ఒమేగా 3తో ఉపయోగాలు..

గుండె రోగాలనుంచి తప్పించుకోవచ్చు

ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించగలదు

వయస్సు పెరిగినా ముఖవర్చస్సు తగ్గదు.

అలెర్జీలు ఉండవు, అటోపిక్ తామర ఎటాక్ చేయదు, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతుంది.

జుట్టురాలడాన్ని నివారిస్తుంది.

జుట్టు కుదుళ్లకు, చర్మానికి కావలసిన ప్రోటీన్లు మరియు పోషకాలను అందిస్తుంది.

తలపై రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చేస్తుంది.

అయితే వీటిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని.. ఇందుకు కావలసిన రుజువులు లేవని అన్నారు హర్వర్డ్ పరిశోధకులు.

సాల్మాన్, హెర్రింగ్, మాకెరెల్ అనే చేపలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసినట్టయితే జుట్టు ఎదుగుదల ఉంటుందని తెలిపారు.

చేపనూనెను వాడేముందు ఎంతమోతాదులో తీసుకోవాలో డాక్టర్లను సంప్రదించవలసిన అవసరం ఉంది. వారి సజిషన్ తోనే చేపనూనెను తగినమోతాదులో వాడాలి.