యూఎన్​ ఏడీఏపీ గుడ్​విల్ అంబాసిడర్​గా బార్బర్ కూతురు

యూఎన్​ ఏడీఏపీ గుడ్​విల్ అంబాసిడర్​గా బార్బర్ కూతురు

చెన్నై: తమిళనాడులోని మధురైకి చెందిన ఓ బార్బర్ కూతురు ఎం.నేత్ర యునైటెడ్‌ నేషన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పీస్‌(యూఎన్‌ఏడీఏపీ) గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఎడ్యుకేషన్ కోసం దాచిన రూ.5 లక్షల నగదును లాక్​డౌన్ ఎఫెక్టుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీల సాయానికి ఖర్చు చేసేందుకు తండ్రిని ఒప్పించిన నేత్ర.. ఆ నగదుతో పేదలను ఆదుకుంది. నేత్ర చేసిన మంచిపనిని మెచ్చుకునన రాష్ట్ర మంత్రి సెల్లూర్ రాజు.. ఆమెకు జయలలిత అవార్డు ఇవ్వాల్సిందిగా సీఎం పళనిస్వామిని కోరుతానన్నారు. బాలిక దాతృత్వాన్ని కొద్దిరోజుల కిందట మన్​కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. కష్టపడి కూడబెట్టిన డబ్బును పేదలకోసం ఖర్చు చేసినందుకు అమ్మాయి తండ్రి మోహన్​ను ప్రధాని ప్రశంసించారు. జెనీవాలో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశాలలో మాట్లాడేందుకు నేత్రకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మేము సాధారణ కుటుంబం నుంచి వచ్చాము. ఈ స్థాయి గౌరవం దక్కుతుందని మేము ఊహించలేదు’ అంటూ నేత్ర త్రండి మోహన్ సంతోషం వ్యక్తం చేశారు.