కేంద్ర మంత్రి పదవికి శివసేన ఎంపీ సావంత్ రాజీనామా

కేంద్ర మంత్రి పదవికి శివసేన ఎంపీ సావంత్ రాజీనామా

మహరాష్ట్రలో  ప్రభుత్వ  ఏర్పాటుపై  సందిగ్ధత  కొనసాగుతున్న వేళ  తన  కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించారు అర్వింద్ సావంత్.  ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో  కేంద్ర కేబినెట్ లో ఉండలేనని  సావంత్ స్పష్టం చేశారు.  శివసేనది సరైన నిర్ణయమేనన్నారు సావంత్.  ప్రస్తుతం అర్వింద్ సావంత్  భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు.  ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా శివసేన నుంచి అర్వింద్ సావంత్ కు అవకాశం దక్కింది. మహరాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ లేని కారణంగా  ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ చేతులెత్తేసింది.  దీంతో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన సిద్ధమైనట్టు  తెలుస్తోంది.  ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు కావాలంటే  NDA నుంచి వైదోలగాలని  ఎన్సీపీ  షరతు పెట్టిన  నేపథ్యంలో అర్వింద్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.