మెట్రో రైలులో పాము

మెట్రో రైలులో పాము

హైదరాబాద్ నగరంలోని మెట్రో రైలులో పాము దూరింది. ఆగస్టు 14వ తేదీన DB031 నంబర్‌ గల రైలు.. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌కు బయల్దేరింది. దిల్‌సుఖ్‌నగర్‌ రాగానే పైలట్‌ డ్యాష్‌బోర్డులో ఓ పాము కనిపించింది. దీంతో అలర్టైన పైలట్‌ రైలును నిలిపేశాడు. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకునే లోపే పాము కనిపించకుండా పోయింది.

రైల్లోని పైలట్‌ క్యాబిన్‌లో ఎంత పరిశీలించిన పాము ఆచూకీ లభించలేదు. అయితే మళ్లీ ఆగస్టు 19వ తేదీన దిల్‌ సుఖ్‌నగర్‌ రాగానే పాము మళ్లీ అదే పైలట్‌ క్యాబిన్‌లో ప్రత్యక్షమైంది. దీంతో రైలును ఎల్బీనగర్‌కు తీసుకెళ్లి.. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈసారి వారు పామును పట్టుకున్నారు. ఈ పాముతో పెద్దగా ప్రమాదం ఉండదని స్నేక్‌ సొసైటీ సభ్యులు తెలిపారు. తర్వాత అటవీ శాఖ అధికారుల సహాయంతో పామును అడవిలో వదిలేశారు.