- లంగర్‌హౌస్‌లో కారు ఢీకొని నలుగురికి గాయాలు
మెహిదీపట్నం : కారు బ్రేక్వేయబోయి.. ఓ డాక్టర్ యాక్సలరేటర్ తొక్కాడు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటున్న ముగ్గురు గాయపడ్డారు. లంగర్హౌస్బాపూఘాట్తపోవనం వద్ద శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ రఘు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్రోహిత్ కన్నా రోజూలాగే శుక్రవారం డ్యూటీకి వెళ్లాడు.
సాయంత్రం తర్వాత కారులో తిరిగి ఇంటికి బయలుదేరాడు. లంగర్ హౌస్ తపోవనం వద్ద బ్రేక్వేయబోయి, యాక్సలేటర్ తొక్కొడు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పండ్లు అమ్ముకుంటున్న తరుణ్(20), తౌఫిక్(28), సోహెల్(35)పైకి కారు దూసుకెళ్లింది. తరుణ్, తౌఫిక్స్వల్పంగా గాయపడగా, సోహెల్ తలకు తీవ్ర గాయమైనట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ రోహిత్ కన్నా బ్రేక్బదులు, యాక్సలరేటర్తొక్కడంతో ప్రమాదం జరిగిందని ఇన్స్పెక్టర్తెలిపారు. ఘటనా స్థలంలో వివిధ రకాల పండ్లు చల్లాచెదురుగా పడ్డాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
