కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు

కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు

పంజాగుట్ట, వెలుగు :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్​పై పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో చీటింగ్​కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్​పేటకు చెందిన ఎస్.కిరణ్​కుమార్​బట్టల వ్యాపారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజాశాంతి పార్టీ ఎల్బీనగర్  టికెట్​కోసం కేఏ పాల్​ను సంప్రదించాడు. టికెట్ కేటాయించేందుకు కేఏ పాల్ అతని నుంచి రూ.50లక్షలు తీసుకున్నాడు.

ఈ మేరకు కిరణ్​కుమార్ గురువారం రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.30లక్షలు ఆన్​లైన్​ట్రాన్స్​ఫర్​చేశారని, రూ.20లక్షలు పలు దఫాలు ఇచ్చానని పేర్కొన్నాడు. అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా.. డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. ఎన్నిసార్లు డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని చెప్పాడు. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.