- పోలీసులకు ఫిర్యాదు
జీడిమెట్ల, వెలుగు : తన కారు నంబర్‌తో మరో కారు తిరుగుతోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే రోహిత్‌కు టీఎస్10ఎఫ్ బీ9999 నంబరు రిజిస్ట్రేషన్‌తో జీఎంసీ, సియరా బ్లాక్కలర్కారు ఉంది. అయితే సదరు కారు ఈ నెల 9న ఓవర్‌స్పీడుతో వెళ్లిందంటూ సూర్యాపేట ట్రాఫిక్పోలీసులు ఈ–చలాన్వేశారు.
ఈ నెల 11న చలాన్‌కు సంబంధించిన మెసేజ్ఎమ్మెల్యే ఫోన్‌కు వచ్చింది. మెసేజ్‌ను చెక్‌చేసి, సదరు కారు తనది కాదని ఎమ్మెల్యే గుర్తించారు. తనది జీఎంసీ సియరా కారు కాగా, చలాన్ జనరేట్అయింది వోక్స్ వేగన్ కారుకు అని తెలుసుకున్నారు.
సేమ్నంబర్తో మరో వ్యక్తి కారు తిప్పుతున్నాడని ఎమ్మెల్యే వ్యక్తి గత సిబ్బంది ఎస్.ఆదిత్యరావు శుక్రవారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
