సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై రేప్ అటెంఫ్ట్..!

సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై రేప్ అటెంఫ్ట్..!

నిజాం పేట్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై రేప్ అటెంప్ట్ జరిగింది. అక్కను రెండు లక్షలు ఇవ్వాలని అడిగితే ఇవ్వనందుకు చెల్లెలిపై రేప్ అటెప్ట్ చేసి ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ నిజాంపేట్ బాచుపల్లిలో జరిగింది. హారిక అనే మహిళ తన కొడుకు, చెల్లెలితో బాచుపల్లి పియస్ పరిధి నిజాంపేట్, కాకతీయనగర్ లో నివసిస్తున్నారు. అయితే… హారిక స్థానిక స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుండగా.. ఆమె చెల్లెలు సాయి ప్రియ గచ్చిబౌలి లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంది. హారిక డివోర్స్ డ్ ఉమన్. ఆమె రెండో పెండ్లి కోసం మ్యాట్రిమోని ద్వారా ప్రయత్నించగా… జయచంద్ అనే వ్వక్తి పరిచయం అయ్యాడు. పెండ్లి చేసుకుంటానని హారికకు మాటిచ్చాడు. దీంతో హారిక ఫ్యామిలీతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు జయచంద్.

శనివారం రెండు లక్షలు కావాలని హారికను జయచంద్ అడిగాడు. మనీ లేవనే సరికి.. నిజాంపేట్ లో నివసిస్తున్న హారిక ఇంటికి తాగిన మైకంలో వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న హారిక చెల్లెలు సాయి ప్రియపై రేప్ అటెంప్ట్ చేశాడు. ఇంట్లో ఉన్న బంగారం చైన్, ఐ ఫోన్ తీసుకుని ఫ్లాట్ డోర్ కు తాళం వేసి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన హరిక లోపల లైట్ వెలుగుతుండటం, బైట ప్లాట్ కు తాళం వేసి ఉండటం తో అనుమానం వచ్చి 100 నెంబర్ కు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు వచ్చి తాళం విరగ గొట్టి చూడగా సాయి ప్రియ అపస్మారక స్దితిలో పడివుంది.

సాయి ప్రియను హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. తనపై అత్యాచారం జరిగిందో లేదో.. ఏమీ గుర్తులేదని చెప్పిందని పోలీసులు తెలిపారు. అయితే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే కేసు నమోదు చేసుకుంటామని బాచుపల్లి సీఐ జగధీశ్వర్ తెలిపారు.