నెదర్లాండ్స్పై శ్రీలంక ఘన విజయం

నెదర్లాండ్స్పై శ్రీలంక ఘన విజయం
  • కీలక మ్యాచ్లో నెదర్లాండ్స్ పై గెలుపు
  • ఓడినా నెదర్లాండ్స్ కూడా ముందుకే
  • రాణించిన కుశాల్, హసరంగ

జీలాంగ్ (విక్టోరియా):ఆసియా చాంపియన్ శ్రీలంకతో పాటు నెడు ర్లాండ్స్ టీ20 వరల్డ్ కప్లో సూపర్-12కు అర్హత సాధించాయి. బ్యాటింగ్ కుశాల్ మెం బీసీ (24 బాల్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79) బౌలింగ్లో హనరంగ 3/28) దుమమ్మురేపడంతో గురువారం జరిగిన గ్రూప్-ఏ ఆఖరి లీగ్ మ్యాచ్లో లంక 16 రన్స్ తేడాతో నెదర్లాండ్స్ ను ఓడించింది. దీంతో లంక 4 పాయింట్లతో గ్రూ ఫౌండ్ రెండో ప్లేస్లో సూపర్ - 12కు చేరుకుంది. శ్రీలంక గూప్-1( ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ,ఆఫ్ఘనిస్తాన్ )లోకి వెళ్లగా..నెదర్లాండ్స్ గ్రూప్ -12 (ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్)లో ఆడనుంది. 

కుశాల్ కేక...

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 1662/6 స్కోరు చేసింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో లంకేయులు స్టార్టింగ్ అప్రమత్తంగా ఆడారు. పవర్ ప్లే తర్వాత ఓపెనర్ సాథమ్ నిషాంక (14), ధనంజయ డిసిల్వా (0) వరుస బాల్స్ వెనుదిరి గారు. ఈ దశలో కుశాల్ చరిత్ అసలంక (31) నిలకడగా ఆడి మూడో వికెట్కు 60 రన్స్ జోడించారు. అయితే డచ్ బౌలర్లు మీత్రిన్ (2/25), టిమ్ ప్రింజిల్, మెర్క్ బాస్ లీడె (2/31) మిడిల్ ఓవర్స్లో లంకేయులను కట్టడి చేయడంతో 140 స్కోరు కూడా కష్టమే అనిపిం చింది. కానీ ఓ ఎండ్ లో  కుశాల్ ఐదు సిక్చర్లు దంచడంతో రన్ రేట్ పరుగెత్తింది. బానుకా రాజు పక్స (19) దాసున్ షనక (8) హసరంగ (5 నాటౌట్), కరుణరత్నె (2 నాటౌట్) విఫలమైనా.... అఖరి 10 ఓవర్లలో 102 రన్స్ రావడంతో  లంక మంచి టార్గెట్ ను నిర్దేశించింది. 

మ్యాక్స్ ఒక్కడే..
టార్గెట్ ఛేజింగ్ లో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 స్కోరు చేసింది. ఓపెనర్ మాక్స్ ఓ  డౌడ్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. ఇన్నింగ్స్ నాల్గో  ఓవర్లోనే మహీశ్ దీక్షణ (2/32) విక్రమ్ జిత్ సింగ్ (7)ను ఔట్ చేయడంతో డచ్ వికెట్ల పతనం మొదలైంది. లాహిరు కుమార్ (1/28), బినురా ఫెర్నాండో (1/33), హసరంగ తమ బౌలింగ్ తో  అండగా నిలిచారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (21), టామ్ కూపర్ (16) మినహా అందరూ విఫలమయ్యారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో డచ్ కు ఓటమి తప్పలేదు. కుశాల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'. అవార్డు లభించింది.

సంక్షిప్త స్కోర్లు.
శ్రీలంక: 20 ఓవర్లలో 2 వికెట్లకు 162 పరుగులు (కుశాల్ మెండిస్ 79, అసలంక 31, మీక్రెన్ 2/25 )

నెదర్లాండ్స్: 20 ఓవర్లలో - 146/9 స్కోరు చేసింది. ఓపెనర్ మ్యాక్స్ ఓ డౌడ్ (53 బాల్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 నాటౌట్) ,హసరంగ 3/28