ఎక్కడున్నోళ్లు అక్కడే ఉంటే మంచిది

ఎక్కడున్నోళ్లు అక్కడే ఉంటే మంచిది

యూఎస్​లోని ఇండియన్ స్టూడెంట్లకు అంబాసిడర్ సంధు సూచన

వాషింగ్టన్: యూఎస్ లో చిక్కుకుపోయిన ఇండియన్ స్టూడెంట్లు ఉన్న చోటే ఉండాలని అక్కడి ఇండియన్ అంబాసిడర్ తరన్ జిత్ సింగ్ సంధు సూచించారు. కరోనా ఎఫెక్టుతో యూనివర్సిటీలు స్టూడెంట్లను హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించాయి. ఈ నేపథ్యంలో అక్కడే చిక్కుకున్న వేలాది మంది స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం 500 మంది స్టూడెంట్లను సమన్వయం చేస్తూ ఇండియా స్టూడెంట్ హబ్ టీమ్ నిర్వహించిన ఇన్​స్టాగ్రామ్ లైవ్​సెషన్ లో సంధు మాట్లాడారు. వీసా సమస్యలపై ఇండియన్ ఎంబసీ అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని, పరిస్థితి మెరుగయ్యాక ప్రయాణాలకు సంబంధించిన ప్లాన్లు వేసుకోవచ్చని వారికి భరోసా ఇచ్చారు. ‘‘అప్పటివరకు ప్రతిఒక్కరు ఉన్నచోటే ఉండటం మంచిది. మేం సహాయం చేస్తాం”అని ఆయన చెప్పారు. అమెరికాలో 250,000 మంది ఇండియన్ స్టూడెంట్లు ఉన్నారని అంచనా. వీరంతా కరోనా ఎఫెక్టుతో అమెరికాలోనే చిక్కుకుపోయారు.